కొండపి, మహానాడు: ప్రకాశం జిల్లా, కొండపి ప్రభుత్వాసుపత్రిలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాలు, వైద్యులు అందిస్తున్న సేవలు తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలు రికార్డులు, మందులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ఆశ్రయించేది ప్రభుత్వ ఆసుపత్రులనే.. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. విద్యా, వైద్యం, ప్రజారోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.