జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ ది దరిద్రపాదం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయాను. ప్రజల కష్టాలను గాలికొదిలేసి… ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న జగన్ రాయలసీమ బిడ్డ కాదు… ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ.

అయిదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమేగాక కరువుసీమలో కార్లపంట పండించిన అపర భగీరథుడు మన చంద్రన్న. గజదొంగ జగన్ కావాలో, విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలే!!