రక్తదాన శిబిరంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఎంపీ

రణస్థలం, మహానాడు: ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలంలో యువత ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యుడు నడుకుదుటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విశ్వక్సేన్‌, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.