-బెస్ట్ పాలసీని తీసుకొస్తాం..
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని బడ్జెట్ లో రూ.321 కోట్లు కేటాయించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చదువులోనే కాదు… క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది.. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఇది నిరూపించెందుకే నిఖత్ జరీన్, సిరాజ్ కు గ్రూప్1 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు.
హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతామని తెలిపారు. మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు.. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇందుకు భూమిని కేటాయిస్తాం అని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.