నోరుజాగ్రత్త…ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు..ఒక్కటీ నిజం లేదు
డిఫాల్ట్ మిల్లర్ల కోసమే వారిద్దరూ మాట్లాడుతున్నారు
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటున్నాం
సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు
మిల్లర్లను కలవాల్సిన అవసరం లేదు
హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్‌లో ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కేటీఆర్, మహేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేటీఆర్, మహేశ్వరరెడ్డి తెలిసీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వారి విమర్శల్లో నయా పైసా నిజం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పౌరసరఫరా శాఖలో రూ.58 వేల కోట్లు అప్పులు చేసిందని వివరించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.11 వేల కోట్లని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ముందే ధాన్యం కొనుగోలు మొదలుపెట్టామని, తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ధరకు కొనాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరలకు ధరకు కొన్న ఏకైక ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు.
సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు
మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా..కనీసం వాళ్లని కలవలేదు. నాలాంటి నిజాయితీపరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు. సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు. రూ.42లకు కిలో సన్నబియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుంది. టెండర్లో ఉన్న కండిషన్స్‌కు ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుంది. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం మాదే. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. డిఫాల్టర్ రైస్‌మి ల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోంది. మిల్లర్లపై చర్యలు ఎందుకు తీసుకో వడం లేదని విమర్శిస్తున్న వాళ్లే మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటు న్నారు.
డబ్బు పంపి పదవి కొనుక్కున్నావ్..
ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నారు. బయట ధాన్యం గురించి మాట్లాడి…లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం మాది కాదు. మహేశ్వరరెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. కిషన్‌రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో ఓవర్ స్పీడ్‌గా పోవాలని అనుకుంటు న్నాడు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో రూ.1700 వచ్చింది. ఇప్పుడు రూ. 2400 వస్తోంది. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.