ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
సంతకం ఉన్నా సరిపోతుందని వెల్లడి
సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు
అమరావతి: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటులో ప్రతిపక్షాలకు భారీ ఊరట లభించింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉండి …సీల్ లేదన్న కారణంతో పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పై కూడా గెజిటెడ్ అధికారి సంతకం ఉండి… సీల్ లేదన్న కారణంతో బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని పేర్కొంది. ఓటర్ తమ బ్యాలెట్ పేపరులో సక్ర మంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికా రులకు సీఈవో ఆదేశాలు ఇచ్చారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అవసరమైతే శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయడం ఆయన బాధ్యత అని స్పష్టం చేసింది. ఫెసిలిటేషన్ సెంటర్ గెజిటెడ్ అధికారి సంతకం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యత అని గుర్తు చేసింది.