– కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్
విజయవాడ: హైదరాబాద్ నుండి గన్నవరం లోని తన ఇంటికి వచ్చిన వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వార్తలు రావడంతో అలాంటిది ఏం లేదు కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ మీడియాకు తెలిపారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వంశీ అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేయునట్లు ఎస్పీ తెలిపారు.వంశీ అనుచరులైన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ కోర్టు విధించింది.
ఇక మరో అనుచరుడు, రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ హైదరాబాద్ లో ఉన్నాడా? లేదా ఆంధ్రాలో ఉన్నాడా అనే సమాచారం పోలీసుల వద్ద లేనట్టు తెలుస్తుంది.