మెదక్ : జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూడో సారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో అధికారులు ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.