విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు.
రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. కాగా వంగవీటి రాధా గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు ఆయన ఇంటికి వెళ్ళారు.