– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరాం స్పష్టం
ధర్మవరం, మహానాడు: కూటమి ధర్మవరం నేతల్లో ఎటువంటి విబేధాలు లేవని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరాం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి ఇబ్బందులు పడ్డాం. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునతో సంబంధం ఉంది. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లాం. గతంలో జరిగిన అన్ని అంశాలను పరిశీలిస్తామని సత్యకుమార్ చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
మా మూడు పార్టీలు కలిసే ఉన్నాం. ఎన్నికల ముందు ఎలా ఉన్నామో.. ఇప్పుడు అలానే ఉన్నాం. మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సంఘటలు ఉంటాయి. అధికారులు, నాయకులు అంతా సెట్ అయ్యాక పనులు జరుగుతాయి. ఇప్పటికే సత్యకుమార్ దృష్టికి అన్ని అంశాలు తీసుకెళ్లాం. సత్యకుమార్ కచ్చితంగా ధర్మవరానికి ప్లస్ అవుతారు. గతంలో భూకబ్జాలు, అనేక అక్రమాలు ఉన్నాయి. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధే మాకు ముఖ్యం. ఇక్కడ చాలా మందికి జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.