రేణిగుంట, మహానాడు: నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం, స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవానికి శనివారం భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం 2.08 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, 2.22 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు.
ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేట్ అయిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి వేంకటేశ్వర స్వామి ప్రతిమను భారత ఉప రాష్ట్రపతి కి బహూకరించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్.పి సుబ్బరాయుడు తదితర అధికారులు ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.