గుంటూరులో నిరుద్యోగ యువత విజయోత్సవ ర్యాలీ

-ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సి అభ్యర్థులు, తెలుగుయువత విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసససభ్యురాలు గళ్ళా మాధవి భారీ ర్యాలీ

లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి
తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునిరుద్యోగ యువతకు ఇచ్చినహామీ మెగా డిఎస్సి మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్ కు బంగారు బాటవేశరని కొనియాడారు. “జాబులు ఇచ్చేది బాబే – జాబులు తెచ్చేది బాబే “అంటూ థాంక్యూ సీఎం సార్ అంటూ తెలుగుయువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి కామెంట్స్ :-
ఇచ్చిన మాట కోసం టీడీపీ కూటమి రాష్ట్రంలో విజయం సాధించగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుకు బాట వేశారు. ఎన్నికల చెప్పిన హామీలను బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి 5 ఫైళ్ల పైన ఎపి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పెన్షన్ల పెంపుపై మూడో సంతకం,అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ (గణన) పై ఐదో సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి యువనేత నారా లోకేష్ విశ్వనానియత చాటారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. రాబోయే 5సం. లలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ 20లక్షల ఉద్యోగాలు పూర్తిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.