దార్శనికుడు కలాం : ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 

నందిగామ, మహానాడు:  మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గుర్తింపు పొందారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కొనియాడారు. నందిగామ పట్టణం కాకాని నగర్ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎన్డీఏ నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశాన్ని ఎంతో ముందుకు నడిపించారన్నారు. సంకల్పం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా చేరగలమన్న సందేశాన్ని యువతరానికి అందించారన్నారు. దేశ అణు, శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికులు కలాం అని కొనియాడారు.