Mahanaadu-Logo-PNG-Large

హిందూ ధర్మ పరిరక్షకులకే ఓటేయండి

తొమ్మిది అంశాల్లో అభిప్రాయాలు వెల్లడిరచాలి
ధార్మిక సంస్థలు, సాధు సంతుల తీర్మానం
కాశీలో హిందూ సంస్థల సమావేశం

వారణాసి, మహానాడు : సనాతన హిందూ ధర్మ సంస్కృతికి సంబంధించిన ఐదు ప్రముఖ ధార్మిక సంస్థల ప్రతినిధులు గురువారం సంయుక్తంగా కాశీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలలో హిందూ ధర్మానికి అనుకూలంగా వ్యవహరించే రాజకీయ పార్టీల అభ్యర్థు లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్‌, అఖిల భారతీయ సంత్‌ సమితి, అఖిల భారతీయ అఖండ పరిషత్‌, గంగా మహాసభ, కాశీ విద్వత్‌ పరిషత్‌ల ఆహ్వానాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం నుంచి వచ్చిన 1500 మంది సాధువులు, సంత్‌లు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మహా మండలేశ్వరులు, మొత్తం 127 సాంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దిగువ తెలుపబడిన తొమ్మిది అంశాల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిరచాలని కోరారు. హిందూధర్మాన్ని రక్షించే వారికే ఓటు వేయాలని సాధు సంతుల సమావేశాలలో తీర్మానించారు.

ఆర్టికల్‌ 30 మార్చాలి

(1) భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 30 మార్చాలని, దాని ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలలో తమ మతానికి సంబంధించిన అంశాలను బోధించుకోవచ్చు కానీ, హిందూ సంస్థలు నడిపే ప్రభుత్వాలు, నడిపే విద్యాసంస్థలలో హిందూ ధర్మానికి సంబంధించిన పాఠ్యాంశాన్ని బోధించడానికి వీలు లేదు. ఈ విషయంలో అందరికీ సమానమైన హక్కు లు ఉండాలి. హిందూ ధర్మం, సంస్కృతీ, సాంప్రదాయాలకు సంబంధించిన వారు విద్యాసంస్థలను నడుపుకునే వీలు కలిగించి ప్రభుత్వం వారికి సకల సదుపాయాలు కలిగించాలి.

వక్ఫ్‌బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి

(2) 1995 వక్ఫ్‌ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి. వక్ఫ్‌ బోర్డు అక్రమంగా ఆక్రమించుకున్న భూములు, ఆస్తులు తిరిగి మఠ మందిరాలకు, దేవాలయాలకు అప్ప జెప్పాలి.

(3) రాజ్యాంగ పరంగా ఒక చట్టం తీసుకువచ్చి మఠ మందిరాలు దేవాలయాల ఆస్తులను, భూములను, మాన్యాలను ఆయా దేవాలయ సంస్థలకు, మఠ మందిర సంస్థల కు అప్పజెప్పాలి.

(4) కేంద్ర పర్యాటక శాఖలో తీర్థ క్షేత్ర యాత్రా ప్రబంధ సంస్థను ఏర్పాటు చేసి తీర్థ యాత్రలను ప్రోత్సహించాలి. భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలి.

లవ్‌ జిహాద్‌లకు కఠినచట్టం తేవాలి

(5) లవ్‌ జిహాద్‌ పేరు మీద చేస్తున్న వివాహాలను, వివాహానంతర మత మార్పిడు లను, హింసా కాండను ఎదుర్కోవడానికి, దోషులను కఠినంగా శిక్షించడానికి కఠినమైన చట్టం తేవాలి.

(6) దేశంలో ఉన్న ప్రతిపౌరుడికి సమానమైన చట్టం ఉండాలి. కామన్‌ సివిల్‌కోడ్‌ వెంటనే అమలు పరచాలి. అక్రమ చొరబాటుదారులను గుర్తించి వెనుకకు పంపించాలి.

(7) మతమార్పిడులను అరికట్టి నిషేధించే చట్టం తేవాలి. ఏదైన కారణం చేత మతం మారిన వారికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ తీసివేయాలి.

(8) హిందూ దేవాలయా లలో పనిచేస్తున్న అన్యమతాల వారిని తొలగించాలి. అన్య మతము ఇమాంలకు, పాస్టర్లకు ఇచ్చినట్టే దేవాలయాలలో పనిచేసే అర్చకులకు, పూజారులకు తగిన గౌరవ వేతనం ఇవ్వాలి.

సాధుసంతుల రక్షణకు చట్టం తేవాలి

(9) సాధువులు, సంత్‌ల కోసం ఒక ‘‘సంత్‌ సేవా ప్రకల్పం’’ ఏర్పాటు చేయాలి. హిందూ ధర్మాన్ని కాపాడే వారి రక్షణ ప్రభుత్వాలే చూసు కోవాలి. సాధుసంతుల రక్షణ, పోషణ కోసం ఒక వ్యవస్థీకృత చట్టం తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో అఖిల భారతీయ సంత్‌ సమితి కేంద్రీయ మహా మంత్రి స్వామి జితేంద్రానంద సరస్వతి మహారాజ్‌, అఖిల భారతీయ అఖండ పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ రవీంద్రపురి మహరాజ్‌, అఖిల భారతీయ సంత్‌ సమితి అధ్యక్షుడు జగద్గురు అవిచల్‌ దేవాచార్యజీ మహరాజ్‌, విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యదక్షుడు ఆలోక్‌ కుమార్‌ జీ, గంగా మహాసభ సంఘటన కార్యదర్శి గోవింద శర్మాజీ, కాశీ విద్వత్‌ పరిషత్‌ కార్యదర్శి రామనారాయణ ద్వివేది పాల్గొన్నారు.