ఓటు విలువ తెలిపే ప్రతినిధి 2 సినిమా

సినీనటుడు నారా రోహిత్‌

పుట్టపర్తి: కూటమి గెలుపు కోసం సినీనటుడు నారా రోహిత్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యట స్తున్నారు. శుక్రవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో నారా రోహిత్‌ మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజల తరపు నుంచి ప్రశ్నించగల గొంతు జర్నలిస్టులది. సమాజం సజావుగా సాగాలంటే జర్నలిస్టు పాత్ర ముఖ్యమై నది. ప్రతినిధిó-2 సినిమాలో జర్నలిస్టు పాత్ర నేను పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర భవిష్యత్తు ఎలా మార్చగలదో ఈ సినిమా ద్వారా ప్రజలకు సందేశ మిచ్చాం. ఓటు విలువ, ఓటు అందరి భవిష్యత్తులను ఎలా మార్చగలదో ఇందులో చూపించి నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల కన్వీనర్‌ అట్లూరి నారాయ ణరావు, తాడికొండ సాయికృష్ణ పాల్గొన్నారు.