సాగర్ కుడి కాలువకు నీటి విడుదల

మాచర్ల, మహానాడు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. కృష్ణా బోర్డు ఉత్తర్వుల మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5, 7 గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున తొమ్మిది రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.