మాకూ ఆయుధాల లైసెన్సులు ఉన్నాయ్‌

– వైసీపీ సర్కారు తన భద్రతను తొలగించింది
– సోమశిల అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్న ప్రతిపక్ష నేతలు
– మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం తన భద్రతను తొలగించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నేను మంత్రి అయ్యాక సీఎం చంద్రబాబు సోమశిలకు వచ్చారు. వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ఇక్కడ జరుగుతోంది. దానిని కూడా ప్రతిపక్ష నేతలు సహించలేకపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేకపాటి సోదరులు ఒక్క అభివృద్ది పని కూడా చేయలేకపోయారు అని మంత్రి విమర్శలు గుప్పించారు.

ప్రజల భద్రతతో‌ పాటు తమ భద్రత గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఆనం విచారం వ్యక్తం చేశారు. మాకు ఆయుధాల లైసెన్సులు ఉన్నాయి. ఇకపై ఆయుధాలతో తిరిగే విషయమై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.