మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం

రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం
మహేశ్వర్‌రెడ్డి అసత్య ఆరోపణలు మానుకో
ఉత్తమ్‌కుమార్‌ వైట్‌ పేపర్‌లాంటి వాడు
తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు రెండు రకాలు ఉంటాయి. వాస్తవాలు మాట్లాడే వారు ఉంటారు.. రెండవ రకం ఏది లేకపోయినా అవాస్తవాలని ప్రచా రం చేస్తుంటారు. మంత్రి ఉత్తమ్‌పై బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌ రెడ్డి బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి ప్రకటించారు. రంగుమారి మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. మూడు నాలుగురోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు ప్రభుత్వం జమ చేస్తుంది.

నిజంగా స్కాం జరిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయరా?

రాష్ట్రంలో మూడు వేలకు పైగా ఉన్న రైస్‌ మిల్లుల నుంచి పెండిరగ్‌ బకాయిలు ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఉత్తమ్‌పై మహేశ్వర్‌ రెడ్డి ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు. వైట్‌ పేపర్‌ లాంటి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మీద బురద ఎందుకు జల్లుతున్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు ఉంటే చర్చకు రండి అనేవి పాత డైలాగ్స్‌..ఇంతటితో ఇది క్లోజ్‌ చేసుకోండి అని మహేశ్వర్‌రెడ్డికి హితవు పలి కా రు. త్వరలో మంత్రివర్గ విస్తరణ మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆధారాలు ఉంటే మీడియాకు ఇవ్వండి. మంత్రివర్గం, సీఎంలు ఒక క్రికెట్‌ టీంగా పనిచేస్తున్నారు. సోనియా గాంధీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆహ్వానించడం మీద విమర్శలు చేస్తున్న వారిపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తారు. కిషన్‌ రెడ్డితో మా కెప్టెన్‌ రేవంత్‌రెడ్డి ఆడుకుంటారని తెలిపారు.