ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం

-పరిటాల శ్రీరామ్

ధర్మవరం పట్టణం 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణ నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.