Mahanaadu-Logo-PNG-Large

నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతాం

అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేదు లేదు
ఇంకా అధికారం భ్రమలోనే వైసీపీ కార్పొరేటర్లు
బానిసలుగా ఉండటానికి అధికారులకు సిగ్గులేదా?
వారి మాటలు వింటే శ్రీకృష్ణజన్మస్థానం తప్పదు
గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి

గుంటూరు: నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలోనే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారని, వాళ్ల కన్నా రాబందులు నయమని మండిపడ్డారు. వైసీపీ నేతల అరాచకాలకు ఇంకా అధికారులు సహకరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు బానిసలుగా ఉండటానికి అధికారులకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. మీరు జీతం తీసుకుంటుంది ప్రజల కష్టారితం అని మరచిపోకండని హితవుపలికారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వైసీపీ నేతల మాటలు వింటే అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని హెచ్చరించారు. అధికారులు, వైసీపీ నేతలు లంచాలు అడిగినా… బెదిరింపులకు పాల్పడినా ప్రజలు కూటమి నేతల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొన్ని రోజుల్లో కార్పోరేషన్‌ పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని వివరించారు. చిరు వ్యాపారులను బెదిరించిన అధికారులు, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.