Mahanaadu-Logo-PNG-Large

జగన్‌ ముఠా మింగిన ప్రతి పైసా కక్కించి తీరుతాం

-ఇసుక, మద్యం సహా అన్ని శాఖలలో అవినీతి
-వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు

వినుకొండ: ఐదేళ్లుగా అడ్డుఅదుపూ లేని దోపిడీతో జగన్‌ రెడ్డి ముఠా మింగిన ప్రతిపైసా కక్కించి తీరుతామని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. అప్పటివరకు తాడేపల్లి నుంచి బయటకు దారి తీసే ప్రతిమార్గంలో పోలీసు లు నిశితంగా నిఘా పెట్టాలని సూచించారు. తాడేపల్లి ప్యాలెస్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వైకాపా దొంగలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరన్నారు. ఇసుక, మద్యం సహా వైకాపా ప్రభుత్వంలో జరిగిన ప్రతి అవినీతి, అక్రమాలపై సరైన రీతిలో విచారణ జరిపించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జ్యుడీషియల్‌ కమిషన్లు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి అందరినీ బోనులో నిలబెట్టాలని కోరారు. మరీ ముఖ్యంగా సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కు మార్‌ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్‌రెడ్డి సొంత పత్రికకు వందల కోట్ల ప్రకటన లు, డిజిటల్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఐప్యాక్‌, అనుకూల మీడియా సంస్థలు, వ్యక్తులకు అక్రమంగా మళ్లించిన వందల కోట్ల రూపాయల లావాదేవీ లపై ప్రత్యేకదృష్టి పెట్టాలని కోరారు.