దర్శిలో సాగునీటి కష్టాలకు పరిష్కారం చూపుతాం
రైతులకు గిట్టుబాటు ధరలు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణానికి కృషి
పాలకు మద్దతు ధర కల్పించే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే…
తాళ్లూరు ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు పమిడి రమేష్ పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీ గ్రామాలలో సాగునీటి కష్టాలు నేను తెలుసుకున్నాను. రామతీర్థం పైపులైన్ పనులను మన ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసుకుందాం..పంటలను కాపాడుకుందామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాలకు మద్దతు ధర వచ్చే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం తీసుకుం టుంది. కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా మేనిఫెస్టోలో వెల్లడిరచారు. కూరగాయ లు నిల్వ ఉండే విధంగా కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించేందుకు కృషి చేస్తాను. గొట్టిపాటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి ఈనెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, గ్రామ సర్పంచ్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొర్రపాటివారిపాలెం వైసీపీ ఖాళీ
కొర్రపాటివారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నేత కొర్రపాటి యలమందరావుతో పాటు మరో 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. దీంతో గ్రామ తెలుగుదేశంలో జోష్ పెరిగింది. గొట్టిపాటి లక్ష్మిని గెలిపించుకుంటామని ప్రతిన బూనారు.