సుజనాచౌదరి కుటుంబం హామీ
కేఎల్‌రావు నగర్లో ఎన్నికల ప్రచారం
విజయవాడ, మహానాడు : కేఎల్‌రావు నగర్‌లోని సుందరమ్మ స్కూల్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారా యణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కేఎల్‌రావు నగర్లో శనివారం సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్‌ను సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. స్కూల్‌ను అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అధ్వానంగా ఉన్న మార్కెట్‌ను ఆధునీకరిస్తామని చెప్పారు. టేనర్ పేట తదితర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కె.నాగమల్లేశ్వరరావు, నాగోతి రామారావు, బాయణ హేరంబకుమార్, గౌరీశంకర్ పాల్గొన్నారు.