సత్తనపల్లి పట్టణంలో శాశ్వత తాగునీటి సమస్య తొలగిస్తాం

-సైకో ప్రభుత్వానికి ఓటేసి మరోసారి మోసపోవద్దు
-కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య తొలగిస్తామని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణం 14వ వార్డులో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు, సైడ్‌ డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

వైకాపా ప్రభుత్వంలో పెరిగిన ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై పది లక్షల భారం మోపారు. సబ్‌ప్లాన్‌ నిధులు లక్షల కోట్లు దారి మళ్ళించారు. పది సార్లు కరెంటు చార్జీల బాదుడుతో ప్రజలపై 75 వేల కోట్ల భారం వేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఈ సైకో పాలనలో విధ్వంసం కనిపిస్తోందని, అభివృద్ధి కానరాడం లేదన్నారు. ఆయన సభల్లో చెప్పేవన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలన్నారు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సత్తెనపల్లి పట్టణంలో కొంచెం కూడా అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.