పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి
ముఖాముఖిలో పలుగు, పార పట్టి భరోసా
కడప, మహానాడు : యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా 200 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కూలీలకు భరోసా నింపేందుకు షర్మిల తాను సైతం పలుగు, పార పట్టి మట్టి తవ్వారు.
అనంతరం మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయి. పొద్దంతా పని చేస్తే ఇచ్చే వేతనం 200 కన్నా మించడం లేదు. వృద్ధులకు 150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రోజు వేతనం రూ.400 ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడు. ఒక చేతితో మట్టి చెంబు ఇచ్చి మరో చేతితో వెండి చెంబు తీసుకున్నాడని వ్యాఖ్యానించారు.