ఎమ్మెల్సీగా ‘ఆలపాటి’ని గెలిపిస్తాం

– ప్రతినబూనిన కూటమి నేతలు

పెడన, మహానాడు: కృష్ణ-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ శాసన మండలి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించుకుంటామని కూటమి నాయకులు ప్రతినబూనారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మంగళవారం పెడన పట్నంలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో సమావేశం జరిగింది. కాగిత కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెనాలిలో టీడీపీ టికెట్ ను త్యాగం చేసిన రాజేంద్రప్రసాద్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాసు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని ఈసారి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలన్నారు. ఓటర్ల నమోదు కు సచివాలయ ఉద్యోగులకు ఉపయోగించుకోవాలని కోరారు. 2021 అక్టోబర్ నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఓటర్లుగా అర్హులని తెలిపారు.శాసనమండలి సభ్యుడు పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం కౌన్సిల్లో కూటమికి మెజారిటీ అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో రెండు రోజుల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటిని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు.

ఈ సమావేశంలో కూటమి నాయకులు బిజెపి సమన్వయకర్త పుప్పాల రామాంజనేయులు, జనసేన సమన్వయకర్త పంచకర్ల సురేష్ బాబు అబ్దుల్ ఖయ్యుమ్(హన్ను), యక్కల శ్యామలయ్య కాసగాని శ్రీనివాసరావు, కట్ట సతీష్ కూనపరెడ్డి, వీరబాబు వరుదు రామకృష్ణ, కూనపరెడ్డి రంగయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.