టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్
గుంటూరు, మహానాడు: కాపుల సత్తా చూపించి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్‌ను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కాపు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పు ఉమ్మడి అభ్యర్థి నసీర్ హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గంలో నసీర్ గెలుపుపై సమావే శంలో కూటమి పార్టీ కాపు నాయకులూ చర్చించారు. వచ్చే ఆదివారం పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్‌లో తూర్పు నియోజకవర్గ కూటమి కాపు నాయకుల సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ కాపు సోదరులు కలిసి కట్టుగా విజయానికి కృషిచేయాలని కోరారు. నసీర్ మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి తన సహకారం ఉంటుందని తెలిపారు. కాపు భవనాలకు, హాస్టళ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి, బీజేపీ నాయకులు శనక్కాయల ఉమాశంకర్, యర్రగోపు నాగేశ్వరరావు, కార్పొరేటర్ పోతురాజు సమత, బిట్రగుంట మల్లిక, మేకల రవీంద్ర, కొలగని సుబ్బారావు, జాడ సురేష్, శేఖర్, ఐలా శ్రీను, పోతురాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.