-ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్ష
-ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ , మహానాడు: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతామని ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ సభ్యుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ…
గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. వైసీపీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థాయిలో నిలుపుతాం. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.
గత ప్రభుత్వంలో పనులపై ఎయిర్ పోర్ట్ లో సందర్శించి సమీక్షించారు.పనుల్లో జాప్యం ఉంటే కాంట్రాక్టర్లను మార్చాలి. అంతేగాని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎయిర్ పోర్ట్ పనులు నిలిపివేసి చోద్యం చూసింది. మా ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం తొమ్మిది నెలల్లోనే ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఎయిర్పోర్ట్ లోఅంతర్జాతీయ టెర్మినల్ పనులు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.