సత్తెనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం 4వ వార్డు సంఘం బజారులో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా భారీ ర్యాలీతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడు తూ సత్తనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. జగన్‌ అధర్మ పాలన పై ధర్మగ్రహ జ్వాల మొదలైంది. ఆయనకు రాజకీయ సమాధి కట్టడమే ప్రజాస్వామ్య న్యాయమన్నారు. సత్తనపల్లి పట్టణంలో అభివృద్ధి జరిగింది అని స్థానికంగా ఉన్న నేతలు చెబుతున్నా రు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తారా అని ప్రశ్నించారు. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవని , ఆయా రంగాల్లో సత్తెనపల్లి పట్టణం వెనుకబడి ఉందన్నారు. కొంచెం కూడా అభివృద్ధికి నోచుకోలేదని కూటమి రాగానే అన్ని రంగాల్లో అభివృద్ధి చూపిస్తామని తెలిపారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.