ప్రతి రైతుకు అండగా నిలబడతాం..

– జనసేన నేత గాదె వెంకటేశ్వరావు

ప్రత్తిపాడు, మహానాడు: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అండగా ఉంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన భారీ వర్షాల వలన ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో వట్టిచెరుకూరు మండలం ముట్లూరు, కారంపూడిపాడు గ్రామాల్లో, కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో నీట మునిగిన పొలాలను గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. కౌలు రైతులు వరి సాగులో ఎకరాకు సుమారు 50,000 వరకు నష్టపోయామని, ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ఏమీ చేయలేని అగమ్య పరిస్థితిలో ఉండిపోయామని రైతులు గాదె వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి త్వరితగతిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని, అలాగే నష్టపరిహారం ఇప్పించే దశలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, పార్టీలకతీతంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులని కోరారు.

అలాగే గ్రామాలకు రవాణా సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, వట్టి చెరుకూరు మండల అధ్యక్షుడు పత్తి భవన్నారాయణ, కాకుమాను మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు, ముట్లూరు గ్రామ అధ్యక్షుడు కోటికం వెంకటేశ్వరరావు, వట్టి చెరుకూరు మండలం నాయకుడు అల్లం దశరథ రామయ్య, గంగిశెట్టి వెంకటేశ్వర్లు, పత్తి పాపారావు, తారక బాబు, సందు ఉపేంద్ర, చేబ్రోలు శ్రీనివాసరావు, కారంపూడిపాడు గ్రామ నాయకులు సందు కుమార్, సందు గోపి, తోటకూర వాసు, కొలిమర్ల గ్రామ జనసేన నాయకుడు సోమరౌతు నాగరాజు, శివశంకర్, కోటేశ్వరరావు, కొల్లిమర్ల మాజీ సర్పంచ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక రైతాంగం పాల్గొన్నారు.