పాతర్లపల్లి విద్యార్థి కుటుంబాలను ఆదుకుంటాం..

– మంత్రి నారా లోకేష్‌

విశాఖపట్నం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. మరో విద్యార్థి ఈ ఘటనలో గాయపడటం బాధాకరం… పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.