Mahanaadu-Logo-PNG-Large

రైతులను ఆదుకుంటాం…

కేసరపల్లి లో రైతులు తో ముఖాముఖి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్

గన్నవరం మండలం కేశరపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటనష్టం పరిశీలించారు.అనంతరంజరిగిన రైతు సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల సమస్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హిందీ లో రైతుల సమస్యలు తర్జుమా చేసి వివరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉపన్యాసం తెలుగులో తర్జుమా చేసి రైతులకు పురంధేశ్వరి వివరించారు.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు.రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నితంగా స్పందిస్తారు.

గత తొమ్మిది రోజులుగా రైతు పోలాలు నీటి మునిగాయి ఈ విషయం తాను ఇక్కడ పరీశీలన లో తెలుసు కున్నాను.రైతులు, కౌలు రైతుల ను కూడా ఆదుకుంటాం అన్నారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మీ సమస్య లు నేను అర్థం చేసుకున్నాను. ఫసల్ బీమా యోజన కు గత ప్రభుత్వం భీమా చెల్లించ లేదని మంత్రి వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వివరించారు.

ఈ సందర్భంగా పంటనష్టం ఎగ్జిబిషన్ సందర్శించారు. ఒక మొక్క ను కేంద్ర మంత్రి నాటారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లి రవీంద్ర, బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు