– ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ కు అభినందన
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేష్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి మద్దతుగా నిలుస్తామన్నారు.