విచారణకు పిలిచిన వారందరినీ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలుపుతారా?

తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి

హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్, రికార్డింగ్ డాన్సులు చేసినా తాము ఏమంటాo అంటూ మహిళలను కించపరిచేలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణకు పిలిచింది. అయితే విచారణకు వెళ్లిన కేటీఆర్ కు మహిళా కమిషన్ సభ్యులు స్వాగతం పలికి రాఖీ కట్టి పంపించారు.

బయటేమో బీఆర్ఎస్- కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఒకరికొకరు విమర్శించుకుంటూ, విచారణకు పిలిచి మహిళా కమిషన్ సభ్యులు రాఖీ కట్టి పంపించారు.

విచారణకు పిలిచిన వారందరినీ అలాగే స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలుపుతారా? కేవలం ఒకరినొకరు విమర్శించుకుని, లబ్ధి పొందడమే ఇరు పార్టీల ఆలోచన.దీన్నిబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అర్థం అవుతోంది. ఈ విషయం మహిళలంతా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలకు చెందిన మహిళా కార్యకర్తలు గమనించాలి.