– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా, 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణం 16వ వార్డులో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా ఏమన్నారంటే… కూటమి ప్రభుత్వం లక్ష్యం సంక్షేమం అభివృద్ధి.
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను” రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు’ ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ… ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.