మృత్యు అంచుల వరకూ వెళ్ళి…

వికారాబాద్‌ జిల్లా: నావంద్గి రైల్వే స్టేషన్‌ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గుడ్స్ ట్రైన్ రావడంతో పట్టాలపై ఆ మహిళ అలాగే పడుకుంది. తన శరీరాన్ని ఏ మాత్రం కదపకుండా ట్రైన్ పూర్తిగా వెళ్ళేంద వరకు అలానే పడుకుంది. ట్రైన్ వెళ్ళిపోయాక మహిళా సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..