గుంటూరు, మహానాడు: గుంటూరు వెస్ట్ డీఎస్పీగా నియమితులైన బెజవాడ మెహర్ జయరాం ప్రసాద్ సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతలో విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యంగా గంజాయి,స్నేక్ డ్రైవింగ్ వంటి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే సంఘ విద్రోహ శక్తుల మీద ఉక్కు పాదం మోపాలని డీఎస్పీకి ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు.