క్రైస్తవ సోదరులతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు : కత్తితో సాధ్యం కానిది.. కరుణతో సాధించవచ్చుచ్చు.. కక్షతో సాధించలేనిది, క్షమాభిక్షతో సాధించవచ్చు అన్న ఏసుక్రీస్తు వాక్యాలను ప్రతిఒక్కరూ గుర్తుంచుకుని, ఆయన సూచించిన మార్గంలో నడవాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఏటుకూరు ఆర్‌సీఎం చర్చిలో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారికి తాము మేలు చేయడానికి వచ్చామని, సేవచేసే వారిని ఆదరించాలని కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మానవజాతి బాగుకోసమే ఏసుక్రీస్తు శిలువ ఎక్కారని అన్నారు. వెలుతురు వైపు చూడాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలే తప్ప ప్రజలను యాచకులను చేసి, వెన్నెముకలు విరగ్గొట్టే నాయకులను దరి చేరనివ్వకూడదని తెలిపారు. అనంతరం ఫాదర్ బాలసౌరి ప్రార్థనలు చేసి ఇరువురు నాయకులను ఆశీర్వదించారు.