Mahanaadu-Logo-PNG-Large

అభివృద్ధా… అదెక్కడ గోపిరెడ్డీ?

నియోజకవర్గంలో ఏ మూలనైనా తట్ట మట్టి వేశావా?
ఉన్న మట్టి, మశానం మొత్తం అమ్మేసుకున్నావుగా…
ఈడ్చి కొట్టేందుకు నరసరావుపేట ప్రజలు సిద్ధం
టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట, మహానాడు : అభివృద్ధి సంక్షేమం అంటూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పే ముందు కాస్త ఆలోచించుకోవడం ఉత్తమమని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ఎద్దేవా చేశారు. ఏ గడప చూసినా, ఏ వీధిలో చూసినా గోపిరెడ్డి చేసిన భూ కబ్జాలకు బలైపోయిన కుటుంబాలే కనిపిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేని ఏకైక వ్యక్తి జగన్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. నియోజకవర్గం, రాష్ట్రం లో ఏమూలనైనా కనీస అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను దగా చేశారన్నారు. వాలంటీర్ల పేరుతో పేదలను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను జగన్‌ రెడ్డి ముఠా కబ్జా చేసింది. నియోజకవర్గంలో గోపిరెడ్డి చేసిన కబ్జాల గురించి చెప్పాల్సిన పనే లేదని విమర్శించారు.

పిట్ట గోడ కట్టుకుంటే కూడా కప్పం వసూల్‌ చేసే గోపిరెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నా రన్నారు. పేదల భూముల మధ్య జగన్‌ రెడ్డి బొమ్మ వేసుకున్నారన్నారు. పట్టా పుస్తకాల పై జగన్‌ రెడ్డి బొమ్మ వేసుకున్నారన్నారు. ఇప్పుడు మరోసారి జగన్‌ రెడ్డి గెలిస్తే భూములన్నీ వారు కబ్జా చేయడం తధ్యం అన్నారు. ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం పై చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. ప్రజల సంపద దోచుకోవడం జగన్‌ రెడ్డి విధానమైతే..ప్రజలకు సంపద పంచాలనుకోవడం చంద్రబాబు విధానమని వివరించారు. వైసీపీకి రాజకీయ సమాధి నరసరావుపేట నుండే మొదలవుతుందని హెచ్చరించారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రజా నాయకుడు కోడెలకు నివాళి

నరసరావుపేట రూరల్‌: ప్రజానాయకుడు, పల్నాటి పులి, నరసరావుపేట అభివృద్ధి ప్రదాత కోడెల శివప్రసాద్‌ మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. నరసరావుపేట పట్టణంలోని కమ్మ హాస్టల్‌లో కోడెల విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోడెల లేని లోటు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ కనిపిస్తుందన్నారు. కోడెల ఆశయా లకు అనుగుంణంగా నడచుకుంటానని తెలిపారు.