వాట్సప్ గ్రూప్ అడ్మిన్లపై నజర్

– ఫేక్ న్యూస్ ఎవరు పోస్ట్ చేసినా అడ్మిన్ బాధ్యుడు
-వరదలపై వదంతుల వ్యాప్తిపై సర్కార్ సీరియస్
– సహాయక చర్యలపై విష ప్రచారం చేసే వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు

ప్రకృతి విపత్తు వరదల రూపంలో విరుచుకుపడి విలయం సృష్టించింది. కష్ట సమయంలో ప్రభుత్వం సర్వశక్తులతో సహాయ చర్యలు చేపడుతోంది. కొందరు దురుద్దేశ పూర్వకంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బాధితులకు సాయం అందించడంలో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడం మాని.. ఫేక్ న్యూస్ ను విపరీతంగా మార్ఫింగ్ చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న పేటీఎం ముఠాలపై పోలీసులు పూర్తిస్థాయి దృష్టి సారించారు. తప్పుడు ప్రచారం చేస్తూ వరద బాధితులను ఆందోళనకు గురి చేస్తున్న ఓ వర్గం మీడియా, పేటీఎం బ్యాచ్లపై, ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతున్న వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై పోలీసులు నిఘా పెట్టారు.

ఫేక్ న్యూస్, వరదలపై వదంతులు, బాధితులకు అందే సహాయంపై విష ప్రచారం ఏ వాట్సాప్ గ్రూప్ ద్వారా స్ప్రెడ్ అయినా ఆ గ్రూప్ అడ్మిన్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అడ్మిన్ లపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఓ వర్గం మీడియా, పేటీఎం బ్యాచ్ లో పంపిస్తున్న ఫేక్ న్యూస్ గ్రూపుల్లో షేర్ చేయకుండా కొందరు అడ్మిన్లు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఫేక్ న్యూస్ ని మరింత మందికి చేరేలా షేర్ చేస్తున్నారు. ఇటువంటి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిస్థాయి దృష్టి సారించారు. వీరంతా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై బురదజల్లేందుకు, ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు ఇటువంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని నిర్ధారించుకున్నారు. వీరిపై ఓ కన్నేసి ఉంచారు.