మంచిదైతే దాని గురించి ఎందుకు దాచారు
చెప్పేదొకటి..చేసేదొకటి..మడమతిప్పడం మీ పేటెంట్
తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ అని ఏది వదలకుండా ప్రకృతి వనరులను దోచుకున్న జగన్ రెడ్డి ప్రజల ఆస్తులను కొట్టేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారని విమర్శించారు. సర్వాధికారాలు టీఆర్వోలకే ఎందుకు కల్పించారు? భూములు వివాదాస్పద రిజిస్టర్‌లోకి ఎక్కితే పేదలకు న్యాయం జరుగుతుందా? ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఒర్జినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉంటే వాటిని తాకట్టుపెడితే ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
హైకోర్టులో అమలు చేయలేదని అఫిడవిట్ ఇచ్చారు…
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వైసీపీ మేనిఫెస్టోలో ఎందుకు పొందుపరచలేదు. నిజంగా ల్యాడ్ టైటి లింగ్ యాక్ట్ ప్రజలు మేలు చేసే అంశమే అయితే దాన్ని ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఎందుకు సీఐడీ ఎంక్వైరీ వేయించారు. ఆ చట్టంలో గొప్పతనం ఏంటో నువ్వే చెప్పొచ్చుగా జగన్ రెడ్డి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణలేదు. సొంత ఆస్తులు కలిగిన వ్యక్తులపై ఈ చట్టాన్ని ఉపయోగించేందుకు తెచ్చారని వివరించారు. ఏపీ హైకోర్టులో ఈ చట్టాన్ని అమలు చేయలేదని అఫిడవిట్ దాఖలు చేశారు. ఇలా రకరకాలుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ రెడ్డి మాటతప్పడం మడమతిప్పడం మీద పేటెంట్ పొందారని విమర్శించారు.
ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎవరు?
అసలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అదికారి ఎవరు? ఈ అధికారిని ఎవరు నియమిస్తారు. ఏ స్థాయి అధికారిని ఈపదవిలో నియమిస్తారు. ఈ టీఆర్వోకు ఏ అధికారాలు ఉంటాయి? అనేది స్పష్టం చేయడంలేదు. మూడు రకాల రిజిస్టర్లలో ఆస్తుల వివరాలునమోదుచేస్తారు. పాత వివాదాలు ఒక రిజిస్టర్, కొత్త వివాదా లకు ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తారంట. ఈ రిజిస్టర్లలో నమోదు అయితే ఇక భూ యజమాని కోర్టుకు వెళ్లే పరిస్థితి లేదు. వైసీపీ నాయకులు నియమించుకున్న టీఆర్వోల వద్దకే తిరగాలి. ఇలా అయితే పేదల కు న్యాయం ఎక్కడ జరుగుతుంది. ఈ దుర్మార్గమైన చట్టాన్ని వెంటనే రద్దుచేయాలని కోరారు.