కేటీఆర్ ఉండొచ్చు కదా?
మోసం అనే పదానికి మరో పేరు సబిత
అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి
సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు?
సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు?
సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా?
సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: మోసం అనే పదానికి మరో పేరు సబితా ఇంద్రారెడ్డి. సునీత లక్ష్మారెడ్డి కోసం ఎన్నికల ప్రచారం కోసం వెళ్తే నాపై కేసు నమోదు చేశారు. కానీ.. సునీత లక్ష్మారెడ్డి మాత్రం బిఆర్ఎస్ లోకి వెళ్ళింది కేసులు నాకు.. పదవులు వాళ్లకు. అక్క బాధ్యత తమ్ముడి కోసం నిలబడాలి. కానీ మరో పక్క నిలబడింది.
సబితా ఇంద్రారెడ్డిని నా సొంత అక్కగా భావించాను నాకు టికెట్ ప్రకటించగానే సబిత రెడ్డి పార్టీ మారారు. సభలో సబితమ్మ, సునీతా లక్ష్మారెడ్డి లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పారు. నర్సాపూర్ లో 2018 లో ఎన్నికల ప్రచారంకు వెళ్తే నాపై రెండు కేసులు నమోదు అయ్యాయి.ఇప్పటికి కూడా కోర్టులకు తిరుగుతున్న.
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్. దగ్గరుండి ప్రచారం చేస్తా అన్నారు. టికెట్ ప్రకటన కాగానే సబితమ్మ పార్టీ మారింది. నర్సాపూర్ లో సునీతమ్మ నేను ప్రచారంకు నేను వెళ్తే నేను పోటీ చేసేటప్పుడు వెళ్లిపోయారు. అసెంబ్లీ లో మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నాం.
కొందరు సభ్యుల శాసన సభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదు. గతంలో కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాలు రద్దు చేయలేదా? గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారు. గతంలో నన్ను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదు. నా దగ్గరకు 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలసి వెళ్ళారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా బడ్జెట్ పై ఇంత చర్చ జరగలేదు. ప్రజాస్వామ్యబద్దంగా సభ నడుస్తుంది.ఒక్క రోజు 17 గంటల పాటు సభ నడిచింది..
కేంద్ర బడ్జెట్ కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టాం. ఈ రోజు ఫుల్ బడ్జెట్ కు ఆమోదం తెలపాలి. సభకు కేసీఆర్, హరీష్ రావు డుమ్మా ఎందుకు కొట్టారు? సబితా ఇంద్రారెడ్డి ఆవేదన చూసైనా కేసీఆర్, హరీష్ రావు అండగా నిలబడాలి కదా? సభలో గందరగోళం చేసేందుకు కేటీఆర్ వస్తున్నారు. మేమే సరిపోతం అంటే ఫ్లోర్ లీడర్ గా కేసీఆర్ ఎందుకు? కేటీఆర్ ఉండొచ్చు కదా? బాధ్యత లేని వ్యక్తి కేసీఆర్ అధికారం లేకపోతే ప్రజలు అవసరం లేదు అన్నట్లు ఉంది.
జగదీశ్వర్ రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు.కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి లు మొత్తంగా 6 గంటలు మాట్లాడారు. సబిత ఇంద్రారెడ్డి కు మాట్లాడే అవకాశం ఇచ్చాం..