Mahanaadu-Logo-PNG-Large

గోకవరం సంత మార్కెట్‌కు పూర్వవైభవం తీసుకువస్తా

-జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, మహానాడు: దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన గోకవరం సంత మార్కెట్‌ను అధ్వాన స్థితికి తీసుకొచ్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం సాయంత్రం గోకవరంలో అశే ష జనవాహినితో మహిళల హారతులు, నీరాజనాలతో ఆయన ఎన్నికల ప్రచార రోడ్‌ షో జోరుగా సాగింది. జగ్గంపేట శాసనసభకు సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని, అదేవిధంగా కాకినాడ పార్లమెంటుకు తంగళ్ల ఉదయ శ్రీనివాస్‌కు గాజు గ్లాస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం సంత మార్కెట్‌ను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని చిరు వ్యాపారులపై భారం పడకుండా చూస్తామని చెప్పారు. ప్రజలకు అన్ని సౌకర్యాలతో మార్కెట్‌కు పూర్వవైభవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.