ఎంఎస్పీ ఇస్తారా లేదా బోనస్ ఇస్తారా?

-వేరుశనగ రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలి
-కనీస మద్ధతు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
-శాసన మండలిలో ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

గురువారం నాడు కౌన్సిల్ లో ఈ అంశాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చర్ల, అచ్చంపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లలో వేరశనగ రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ఆ పంటకు క్వింటాలుకు రూ. 6377 కనీస మద్ధతు ధర ఉండగా… వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రూ. 5 వేలలోపు కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.

రైతులను వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వేరుశనగ పంటకే కాకుండా అన్ని పంటలకు కనీస మద్ధతు ధర కంటే తక్కువ ధర ఉంటే రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, కాబట్టి కనీస మద్ధతు ధర కల్పిస్తారా లేదా బోనస్ ఇస్తారా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వేరుశనగ రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.