ప్రతి పల్లెలో మౌలిక వసతుకు కృషి చేస్తా…!

– ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

కలిగిరి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ 100 రోజులలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గ్రామంలోని ప్రజలకు చేరవేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో శుక్రవారం ఉదయగిరి శాసన సభ్యుడు కాకర్ల సురేష్‌, మెట్టుకూరి చిరంజీవి రెడ్డితో కలిసి గ్రామ నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ మల్లినేని శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటగా మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కొరకు ముందడుగు వేశామని, చెప్పిన విధంగానే పింఛన్ వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి 3వేల రూపాయల పెన్షన్ ను 4వేల రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. రైతుల పాలిటి శాపంగా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, ప్రకృతి విపత్తు కారణంగా విజయవాడ నగరం నీట మునగగా 10 రోజుల పాటు అహర్నిశలు శ్రమించి అక్కడ ప్రజలకు ప్రభుత్వ సహాయ సహకారాలను అందించి త్వరగా కోలుకునే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, మాజీ మండల కన్వీనర్లు తాతయ్య, నరసింహులు నాయుడు, రైతు అధ్యక్షుడు బొల్లినేని రామారావు, రైతు నరేంద్ర, గ్రామ సర్పంచ్ గోగుల మంజుల, మాజీ సర్పంచ్ తాల చిన్న మాలకొండయ్య, మాజీ ఎంపీటీసీ గోగుల వీరయ్య, గంజాం రాఘవేంద్ర, తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.