– స్వచ్ఛంద సేవా సంస్థలు, నెహ్రూ యువ కేంద్రం
కడప : రక్తదానం పురుషులే కాకుండా మహిళలు కూడా చేసి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలలోనూ మేము ఏమాత్రం తీసిపోమని నిరూపించడం ఎంతో గొప్ప విషయం అని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సోషల్ వెల్ఫేర్ డి. డి సరస్వతీ అన్నారు.
కడప స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల్లో భాగంగా జే.బీ.వీ.ఎస్. ది ప్రజర్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడున్న రక్తం కొరతను తెలుసుకొని రక్త వారోత్సవాల్లో భాగంగా వివేకానంద ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు పుణ్యకార్యమైన రక్తదానా శిబిరం నిర్వహించడం అభినందనదాయకమని ప్రశంసల వర్షం కురిపించారు.
మరో అతిథిగా విచ్చేసిన వైవియూ ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయాలంటే ఆరోగ్యకరంగా ఉండే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగి 45 కేజీల బరువుతో 12 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉన, యువతీ యువకులు, పెద్దలు ఎవరైనా రక్తదానం చేస్తే ఎన్నో గొప్ప ఆరోగ్య లాభాలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రక్తం యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి రెండు, మూడు సార్లు మా కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని మరియు రక్త వారోత్సవాలు అని ఒక మహత్తర కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్న స్వచ్ఛంద సేవా సంస్థలపై హర్షం వ్యక్తం చేశారు.
రక్త వారోత్సవాల్లో భాగంగా మహిళలు మాకేం అవసరం, మేము ఎక్కడ ఇవ్వగలం, మేమే ఇబ్బందులు పడుతుంటామని అనుకోకుండా ప్రాణదానం చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమని జె.బి.వి.ఎస్. ధి ప్రిజర్వర్ సేవా సమితి వ్యవస్థాపకుడు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అయిన అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది సంస్థ సభ్యులైన కాశి, సుస్మిత, హర్షిత, ఈశ్వరయ్య మరియు మహిళా రక్తదాతలు పాల్గొన్నారు.