సత్తెనపల్లి టీడీపీ పరిశీలకుడు తాతా
ముప్పాళ్ల, రాజుపాలెం తెలుగు మహిళలతో సమావేశం
సత్తెనపల్లి, మహానాడు : మహిళా సాధికారత చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని టీడీపీ నియోజకవర్గ పరిశీల కుడు తాతా జయప్రకాష్ నారాయణ అన్నారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం పట్టణంలోని టీడీపీ ప్రజా వేదికలో ముప్పాళ్ల, రాజుపాలెం మండలాల తెలుగు మహిళల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన మహిళా సంక్షేమం గురిం చి వివరించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు భీమినేని వందనాదేవి, మన్నవ శారదా దేవి, నియోజకవర్గ నాయకులు గొర్రెపాటి సుశీల, బండారు సంధ్య తదితరులు మాట్లాడుతూ సైకో పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాల ని కోరారు. మహిళలంతా సూపర్ సెక్స్ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించా లని కోరారు. ఈ సమావేశంలో తెలుగు మహిళలు నెల్లూరు అహల్యరాణి, ఎస్.సీతమ్మ, ఆండాలు, తిరుమలశెట్టి రాజ్యలక్ష్మి, కొట్టారు సంధ్య, రాజుపాలెం, ముప్పాళ్ల మండలాల తెలు గు మహిళలు పాల్గొన్నారు.