పంచిన చీరలను ఇళ్లపైకి విసిరికొట్టారు
ప్రలోభాలకు దూరంగా పినపళ్ల గ్రామం
అంబేద్కర్ కోనసీమ జిల్లా, మహానాడు: ఆలమూరు మండలం పినపళ్లలో శనివారం రాత్రి వైసీపీ నాయకులకు షాక్ ఇచ్చారు. వారు పంచిపెట్టిన చీరలను తమకు వద్దంటూ వారి ఇళ్ల మీదకు విసిరికొట్టారు. వైసీపీ 300 మంది మహిళలు మాకుమ్మడిగా వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ల గ్రామం ఆదర్శగ్రామంగా నిలిచింది. అంతేకాకుండా మిగిలిన గ్రామాలలో కూడా ఇదే మార్పు వస్తుందని, తిరుగుబాటు చేస్తే అవినీతి చేసే నాయకుడు ఒకడు కూడా ఉండరని సర్పంచ్ సంగీత సుభాష్ తెలిపారు. కుట్రలు, కుతంత్రులు చేసే వైసీపీ చిల్లర రాజకీయాలకు ఇక చెల్లవని హితవుపలికారు. ఓటు అనే ఆయుధంతో మనం సమాధా నం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే పోరాటం, ఇదే మార్పు, ఇదే సంచలనం, ఇదే స్ఫూర్తితో పినపళ్ల గ్రామాన్ని రాష్ట్రంలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్న సర్పంచ్ సంగీత సుభాష్‌కు ప్రతిఒక్కరూ అండగా నిలుస్తున్నారు. పినపళ్ల గడ్డ జనసేన అడ్డా అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మధుర్‌ను గెలిపించాలని సర్పంచ్ సంగీత సుభాష్ పిలుపునిచ్చారు.