సమస్యల పరిష్కారానికి కృషి

– ఎమ్మెల్యే చదలవాడ

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎలాంటి సమస్య ఉన్నా తనకు చెప్పొచ్చని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ..రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ వద్ద టీ తాగుతూ సామన్యులతో ముచ్చటించారు. గత పాలనకు నేటి పాలనకు తేడా ఏమైన గుర్తించారా అని అడిగారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే నేరుగా వచ్చి ముచ్చటించడం, సమస్యలపై ఆరా తీయడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.