గురజాల, మహానాడు : పిడుగురాళ్ల మండలం చిన్నఅగ్రహారం గ్రామంలో గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నఅగ్రహారం గ్రామంలోని శివాలయం సెంటర్ నుంచి గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ గజమాలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జంగా వెంకట కోటయ్య, గ్రామంలోని కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.